స్కాలర్ షిప్ కు అప్లై చేసుకొనే విద్యార్థుల అర్హతలు
- ఎస్ ఎస్ సి లో ఉత్తీర్ణులై, జూనియర్ ఇంటర్ లో చేరినవారికి కనీస అర్హత - ఎస్ ఎస్ సి లో గ్రేడ్ ఏ -2 (8.3 జిపిఏ) మరియు ఆపైన సాధించిన వారు అర్హులు.
- సీనియర్ ఇంటర్ లో చేరిన వారికి , జూనియర్ ఇంటర్ లో ఎంపిసి లో ఏ1, బైపీసీలో ఏ2, ఎంఇసి లో బి1, సిఇసి మరియు హెచ్ఇసిలో బి2 మరియు ఆపైన కనీస గ్రేడులు సాధించిన వారు అర్హులు.
- ఎంసెట్, నీట్ లలో (మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) ఫ్రీ సీటు సంపాదించిన వారు అర్హులు.
- ఐసెట్ మరియు ఇతర పీజి కోర్సులలో అనగా ఐసెట్, ఓయుసెట్, ఎస్ వి సెట్, ఏఎన్ యు సెట్ లలో ఫ్రీ సీటు సంపాదించిన వారు అర్హులు.
- పిహెచ్ డి చేసే విద్యార్థులు స్కాలర్ షిప్ లేనివారు మాత్రమే అప్లై చేసుకొనుటకు అర్హులు.